ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 8:11 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

నైపుణ్యంతో కొలువుల బాట.సింగరేణి ఆర్జీ–1 నైపుణ్య శిక్షణ కేంద్రం నుంచి 112 మంది ఉద్యోగాలకు ఎంపిక.

నైపుణ్యంతో కొలువుల బాట.సింగరేణి ఆర్జీ–1 నైపుణ్య శిక్షణ కేంద్రం నుంచి 112 మంది ఉద్యోగాలకు ఎంపిక.

గోదావరిఖని:అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 12.

ఫాక్స్కాన్లో 87 మంది మహిళలకు అవకాశం,తొలి విడతలో బయలుదేరిన 55 మంది మహిళలు

సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలనిస్తోంది. రామగుండం–1 ఏరియాలోని సింగరేణి జీవీటీసీ నైపుణ్యాభివృద్ధి కేంద్రం ద్వారా తాజాగా 154 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. 127 మంది మహిళా అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా.. వీరిలో 87 మంది హైదరాబాద్లోని ఫాక్స్కాన్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపిక కాగా, మరో 27 మంది  పురుష అభ్యర్థులు సోలార్ టెక్నిషియన్ ఇంటర్వ్యూలకు హాజరు కాగా.. వీరిలో  25 మంది  సోలార్ టెక్నిషియన్లుగా ఉద్యోగాల్లో చేరనున్నారు. ఫాక్స్కాన్కు ఎంపికైన మహిళల్లో తొలి విడతగా 55 మంది ఆదివారం గోదావరిఖని నుంచి హైదరాబాద్కు బయలుదేరారు.

శిక్షణ నుంచి ఉపాధి వరకు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ  భట్టి విక్రమార్క రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కేంద్రం స్థానిక యువతకు నైపుణ్య శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది. గత రెండేళ్లలో 500 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించింది. మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది.